వ్యవసాయ శాఖలో 197 పోస్టులు
మరొకసారి357 ఉద్యోగాలకు టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్" మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వ్యవసాయ శాఖ లో వ్యవసాయ అధికారి 120 పోస్టులు, ఉద్యానవన శాఖలో ఉద్యానవన అధికారి 75 పోస్టులు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ లో మేనేజర్ 146 పోస్టులు , నీటిపారుదల శాఖలో ఎఇఇ (మెకానికల్) 16 పోస్టులను భర్తీ చేయ నున్నారు. ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని టిఎస్‌పిఎస్‌సి సూచించింది. హైదరాబాద్ వాటర్ వర్క్ మినహా మిగిలిన వాటికి అక్టొబరు 17న రాత పరీక్షనిర్వహించనున్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ పోస్టులకు నవంబర్ 1న పరీక్ష నిర్వహిస్తారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ పోస్టుల భర్తీని మొదటి సారి అవకాశం కల్పించారు. ఇతర వివరాలను కమిషన్ వెబ్ సైట్ www.tspsc.gov.in అందుబాటులో ఉంచారు. మరో వారం రోజుల్లోపు అసిస్టెంట్ మోటార్ వెకిల్ ఇన్స్‌స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

No comments:
Post a Comment